హైకోర్టులో ఇమ్రాన్ పిటిషన్

హైకోర్టులో ఇమ్రాన్ పిటిషన్

పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్​ యాప్స్ ​ ప్రమోషన్​ కేసుకు సంబంధించి పంజాగుట్ట పీఎస్​లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హైకోర్టులో ఇమ్రాన్  గురువారం పిటిషన్​ వేశాడు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరాడు. అందుకు కోర్టు నిరాకరిస్తూ పోలీసు విచారణకు సహకరించాలని ఇమ్రాన్​ను ఆదేశించింది. కాగా,  విష్టు ప్రియ, శ్యామల తమ కేసును కొట్టి వేయాలంటూ ఇప్పటికే  కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.